పాకిస్తాన్ దేశంలో ఇదొక ప్రమాదకరమైన సమస్యగా పరిణమించడం చాలా ఆశ్చర్యకరం.
అక్కడి ప్రజలు ఓ వ్యసనానికి బానిసలౌతుండడం,అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
ఆ వ్యసనాన్ని మాన్పించమని ప్రభుత్వాధికారులు చెబితే,వారిని వ్యసనపరులు చితకబాదుతుండడంతో పరిస్థితి సమస్యాత్మకమై కూచుంది.
మండ్రగబ్బ (ఓ తేలు జాతి)ను చంపి,విషమున్న కొండితో సహా నూరి,కాలుతున్న బొగ్గులపై వేసి,ఆ పొగను పీల్చి ఆనందించడమే ఈ వ్యసనం.
విషపు వాయువులు మంచి నిషాను ఇస్తున్నాయని వ్యసనపరులంటుంటే,వైద్యులు మాత్రం ఈ వ్యసనపరులు శారీరకంగానూ,మానసికంగానూ ప్రమాదంలో పడుతున్నారని హెచ్చరిస్తున్నారు.
పరిష్కారమేమిటో మరి?
Comments
Post a Comment